Sunday, November 4, 2007

దమనం


మహారాణి పేట , 3-5-37 ,



...మీరు వ్రాసిన విషయం నిజం. నా నిరీశ్వరదినాల ప్రారంభం నుంచి, విద్యకోసం ప్రజలు పెట్టే యీ గోలకి నేను వ్యతిరేకం. పొలం నుంచి బడికి, ఏటినుంచి పుస్తకానికి From the field to the school, from the brook to the book. పిల్లల్ని విడదీసి తీసుకొచ్చి, బడి అనే మురికిగుంటలో ఖైదు చేసి, జీవంలేని, అర్థం లేని, మూర్ఖపు అక్షరాలతో, అతన్ని చంపడమన్నమాట .
Now the masses, hitherto,
they even exploited by the priest and the capitalist
Now the congressman exploits them for election
The communist for revelution
The educationalist for promotion
And the story writer for reputation.

... మొన్న ఒక great philanthrophic public woman worker నాకు వ్రాసింది. నాకో అనాథ శరణాలయం వుంది. పిల్లలు లేరు. అనాథలైన పిల్లల్ని పంపండి, అని, నేను జవాబు వ్రాశాను. ఆ శరణాలయాన్ని మూసేసి, ఆ ధనంతో అనాథలైన తల్లిదండ్రులు వుండి తిండిలేక మాడే బీద పిల్లల్ని చేర్చుకుని పోషించరాదా?అని. ప్రత్యుత్తరం లేదు. కాని త్వరలోనే ఆమె కాళ్లు పట్టుకోవలసి వచ్చింది. హిందూ మహమ్మదీయ సంబంధం వల్ల పుట్టిన యెవరికీ అఖ్కర్లేని పాప, మాకు భారం కావడం చాత, శరణాలయంలోకి తీసుకోమని నేనే బతిమాలవలసి వొచ్చింది. మనుష్యుల పిల్లల్ని ఇట్లా బంగీలమల్లే పంపించెయ్యడం నా గుండె చీల్చినట్టుంటుంది. మా ఇంట్లో పుట్టే ఈ దిక్కులేని పిల్లలందర్నీ జాగ్రత్తగా పెంచగల ఆరోగ్యమో లేక ధనమో నాకు వుండకూడదూ ?

...కామనిరోధాన్ని బోధించే గాంధీగారిని చూస్తే నాకు కోపంగా వుంది. నేను అవినీతిని బోధించనీ, ఆదరించనీ, నాకు మొనాగమీలోనూ, దమంలోను విశ్వాసం . కాని ఆ ఆదర్శ శిఖరాలెక్కడ, మనమెక్కడ? పోనీ వాటిని ఆదర్శాలుగా పెట్టుకుని, జీవితంలో వాటికై ప్రయత్నించరాదా? అంటారా మీరు? గాంధీగారితో నాకు విరోధమెక్కడ అంటే దమనం ఏ రోజునైనా సరే, ఎవరికైనా సరే చాలా సులభ సాధ్యమైనట్టు మాట్లాడతారు, ఆయన. He is misleading people and landing them into moral aberations neurotic, vagaries and self deception. సాధ్యంగాని ఆదర్శానికై బలవంతపరిస్తే పర్యవసానం ఘోరం. ఆయన మాటని విచక్షణ లేకుండా నమ్మేవాళ్లు వేనకు వేలు వుండవచ్చు.





Print this post

0 comments:

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile