Sunday, March 29, 2009

జాతకం | చలం ఉత్తరాలు | గుంటూరు, 14-03-1930










గుంటూరు,
14-03-30


my dear pendulum,

మీ వుత్తరానికి వెంటనే జవాబువ్రాసితీరాలనిపిస్తోంది. అంతపని తొందరలో వ్రాసినా
మీ వుత్తరం సోడామల్లె పొంగుతోంది. పెట్టిపోయిన ఆ మూర్ఖపు గొడవనతా ఒక్కసారిగా మానేశాను.
సూర్యనమస్కారాలు ముఖ్యం. అలసిపోయినాను. ఏ మాత్రం లేదు Inspiration , బైటనించి గాని, లోపల్నించి గాని.

మా హెడ్మాష్టరు కుదర్చడానికి రోగుల్ని వెదకడంలో నిమగ్నుణ్ణి ప్రస్తుతం. కొంతశక్తి వుంది ఆయనకి. కాని వుత్త nonsense మాట్లాడుతాడు. ఆ సాహేబు, ఎన్నేళ్ళకిందో చచ్చిపోయిన యీవూరి ఉర్సుమస్తానుని కలుసుకొని మాట్లాడానంటాడు.

రోజూ నేనూ సుబ్బారావూ జాగ్రత్తగా జరుగుతున్న సంగతుల్ని గమనించి గాంధీగారిని చర్చించుకుంటున్నాము.
నా వుత్సాహాన్ని అణిచిపెట్టడం కష్టంగా వుంది. ఏ నిమిషానో తెంచుకుని ఆయనతో చేరి పోతానేమో ? ఎవరికి తెలుసు ?

మొన్న రైల్లో సౌరిస్ టాగూరుగార్ని కలుసుకుంది. ఆయన షౌ చేతిని పట్టుకున్నారు.
ఆయన్ని గురించి Rave చేస్తోంది.

చ్చుకి కథలు తయారు చేస్తున్నాను. బెజవాడలో మీకు యోగాసనాలు నేర్పుతాను. మీ వెన్నెముక తాగుతుంది వాటిని.

Mrs. భూషణం నా బతుకుని చెడ్డకలగా మారుస్తోంది.
ఒకటేగొడవ, ఆ శుకుడి జాతకం పట్టుకుని,

"నేను సుఖంగా వుంటానని వుంది, కాదూ?"
"అవును."
"సుఖంగా అంటే ?"
"అంటే, సుఖంగా అన్నమాట."
"ఎట్లా?"
ఏం చెప్పను ??
"మరి నా నలభై మూడోయేట ఏం జరుగుతుందో చెప్పలేదే?, మేషలగ్నం అంటే ఏమిటి?"

నాకేం తెలుసు ? మేషంవొచ్చి ఆమెకు లగ్నం చేస్తుందనా?
ఆ జతకం అతను మోసాలమారిట. నన్ను వెళ్ళి అతన్ని తన్నమంటుంది.
లేకపోతే తానేవొచ్చి అతన్ని తంతానంటోంది.
ఇంక అతను ఆడవాళ్ళకి జాతకాలు చెప్పడనుకుంటాను.





Print this post

0 comments:

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile