Monday, May 18, 2009

చలం, చలం గురించీ ఇతర సైట్లల్లో, బ్లాగుల్లో | Updated | చలం గారి జాతక విశ్లేషణ




లం గారి గురించి ఇతరుల అభిప్రాయాలూ, ఆయన, ఆయనపై వచ్చిన పుస్తకాల పై సమీక్షలు, ఆయన భావోద్రేకాలూ, అభిప్రాయాలూ, అంతరంగాలూ, ఇంటర్వ్యూలూ , అయన గొంతు వినాలనుకునేవాళ్ళకీ వగైరా వగైరా references కి ఇతరుల బ్లాగుల్లో, సైట్లల్లో ఈ కింద పట్టీలో చూడగలరు. యింకేమైనా మీకు లింక్స్ కనిపిస్తే పంపించగలరు.






“చలం సాహిత్యంలో స్త్రీ” పుస్తకం పి.హెచ్.డి. పరిశోధన కోసం డా. వెన్నవరం ఈదారెడ్డి గారు రచించినది. ఇతను చలం సాహిత్యంతో పాటు కొడవటిగంటి కుటుంబ రావు, రంగనాయకమ్మ, అల్లం రాజయ్య వంటి వారి సాహిత్యం కూడా చదివారు. చలం గారు మొదట బ్రహ్మ సమాజికుడుగా ఉండేవారు. బ్రహ్మ సమాజం వారికున్న సైద్ధాంతిక పరిమితులు అధిగమించి బ్రహ్మ సమాజం వారి కంటే గొప్ప స్త్రీవాదిగా ఎదిగారు చలం గారు. చలం గారి స్త్రీవాదం యొక్క ఎదుగుదల, అందులోని పాజిటివ్ కోణాలపై ఈ పుస్తకంలో రివ్యూలు వ్రాసారు ఈదారెడ్డి గారు.

చలం సాహిత్య నేపథ్యం: బ్రిటిష్ వారి కాలంలో ఇండియాలో మూఢ నమ్మకాలు చాలా ఎక్కువ ఉండేవి. ఈ మూఢ నమ్మకాల వల్ల ఎక్కువగా బాధ పడింది స్త్రీలు, దళితులు. మూఢ నమ్మకాలతో బాగా కుళ్ళిపోయిన సమాజాన్ని సంస్కరించడానికి బ్రహ్మ సమాజం అనే సంస్కరణవాద సంస్థ ఆవిర్భవించింది. బ్రహ్మ సమాజం వారి డిమాండ్ ప్రకారం బ్రిటిష్ వారు 1956 విధవ పునర్వివాహాలని అనుమతిస్తూ ...

[...read more...]


చలం గారి జాతక విశ్లేషణ

చలం గారు 19-5-1894 వైశాఖ పూర్ణిమ రోజున జన్మించారు. జనన సమయం దొరకలేదు. కాని జనన కాల సవరణ చేయబడినది. అది ఎలా చేశాను అనేది తరువాత వ్రాస్తాను. ఆయన పుట్టిన సమయానికి గ్రహ స్థితి ఈ విధంగా ఉంది.





రవి, బుధ , గురువులు వృషభం.
శని , కేతువులు కన్యా
చంద్రుడు వృశ్చికం
కుజుడు కుంభం
రాహు, శుక్రులు మీనం

లగ్నం నా అంచనా ప్రకారం, తుల కావచ్చు. శని వారం. నక్షత్రం అనూరాధ-1 పాదం. లాహిరి అయనాంశ వాడాను.

ఫలిత విశ్లేషణ:

పూర్ణిమ రోజు గాని దాని దగ్గరలో గాని పుట్టిన వారికి దాంపత్య జీవితం బాగుండదు అనటానికి అనేక ఉదాహరణలు ఇవ్వవచ్చు. వారి వైవాహిక జీవితంలో ఏదో విధమైన లోపము, దిగులు, కష్టాలు లేదా వెలితి తప్పక ఉంటుంది. దానికి కారణం ఏమనగా, జీవితానికి వెలుగు ఇవ్వ వలసిన సూర్య చంద్రులు ఒకరి కొకరు సమ సప్తకంలో ఉండటమే. అనేక జాతకాలలో



“చలం - స్త్రీవాదం” పుస్తకం చలం గారి స్త్రీవాదం పై పలువురు స్త్రీవాద రచయితలు, రచయిత్రుల అభిప్రాయాలు గల వ్యాసాల సంకలనం. ఇందులో ఏటుకూరి బలరామ మూర్తి, డా. చందు సుబ్బారావు, డా.ఎన్. రామచంద్ర, డా. సంజీవమ్మ, డా. రావి భారతి, డా. ఆలూరు విజయ లక్ష్మి, డా. అల్లూరు రాజ కుమారి, డా. ఎస్.వి. సత్యనారాయణ, పరకాల పట్టాభి రామారావుల వ్యాసాలు ఉన్నాయి. ఈ రచయితలు, రచయిత్రులు (పరకాల పట్టాభి రామారావు తప్ప అందరు) చలం గారు గొప్ప స్త్రీవాదే అని అంగీకరించారు కానీ ఏటుకూరి బలరామ మూర్తి గారు, చందు సుబ్బారావు గారు కొన్ని విషయాలలో చలం గారిని తీవ్రంగా విమర్శించడం జరిగింది. వారు చలం గారిని విమర్శించినప్పటికీ చలం గారి సాహిత్యంలోని పాజిటివ్ అంశాలని అంగీకరించారు.

ఏటుకూరి బలరామమూర్తి గారి దృష్టిలో చలం గారు గొప్ప స్వేచ్ఛావాదే కానీ స్వేచ్ఛకి కొన్ని పరిమితులు ఉండాలని బలరామమూర్తి గారి వాదన. పశ్చిమ దేశాలలో కొంత మంది స్వేచ్ఛ పేరుతో బరితెగింపు తిరుగుళ్ళు తిరగడం జరుగుతోంది. ఇండియాలో కూడా కొంత మంది ఆ చెడు తిరుగుళ్ళ సంస్కృతిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. స్వేచ్ఛకీ, విచ్చలవిడి తనానికీ ఉన్న తేడాని చలం గారు స్పష్టంగా వివరించలేకపోయారని బలరామమూర్తి గారి అభిప్రాయం. చలం గారి సాహిత్యాన్ని ఫిల్టర్ చెయ్యాలని చందు సుబ్బారావు గారు కూడా...









మా తాతయ్య చలం - ఓ మనవరాలి అంతరంగం

దేశం పట్టనంత పేరున్న రచయిత గురించి లోకానికి తెలియని విషయాలను వారితో చెట్టపట్టాల్ పట్టుకొని తిరిగిన వారు చెబితే, నిజంగానే ఆసక్తికరంగా ఉంటుంది. తండ్రో, తాతో రచయిత అయితే ఆయన పుస్తకాలను ప్రచురించడం తన కర్తవ్యంగా భావించి ఆ పనిచేస్తే వారిపట్ల కర్తవ్యాన్ని నెరవేర్చిన వారవుతారు. విశ్వనాథ పట్ల విశ్వనాథ పావనిశస్త్రి, నాయని సుబ్బారావు పట్ల నాయని కృష్ణకుమారి, దేవులపల్లి పట్ల ఆయన సంతానం. ఇలా ఎందరో ఈ విద్యుక్త ధర్మాన్ని నేరవేర్చినవారే. అయితే చలం మీద చలం గురించి ఏ సభ జరిగినా అక్కడ ప్రత్యక్షమయ్యే సీనియర్ రచయిత్రి తురగా జానకిరాణి చలం గురించి, ఆయన రచనల గురించి ఏవేవో విషయాలు ముచ్చటిస్తుంటే చలం అభిమానులు ఆసక్తి ప్రదర్శించిన మాట వాస్తవం. అయితే ఆమె అభిమానుల్ని ఉత్సాహపరిచే ముచ్చట్లతో పాటు, కొంత నిరుత్సాహానికి గురిచేసే విషయాలు చెబుతున్నారు. 'మా తాతయ్య చలం' పేరుతో ఆమె పంచుకొంటోన్న సంగతులు కొన్ని విందాం.

1. చలం నన్ను ఒక రచయిత్రి గా చూడలేదు. నాకు చాలా భయం. ఆయనకి నేను వ్రాసినవి చూపాలంటే.

2. మనుషులతో గెట్ ఆన్ కావడం మంచిదే. కాని వాళ్లతో గెట్ ఆన్ కావడం కోసం, మన స్వతంత్ర్యాన్ని, మన కన్విక్షన్స్ ని వొదులుకోవడం, కాంప్రమైజ్ కావడం సూసైడల్. వాళ్ల మీది ప్రేమ వల్ల వొదులుకో. (నిజమైన ప్రేమకన్న గొప్పది లేదు) వాళ్లకి జడిసి కాదు. వాళ్లిచ్చే స్నేహానికీ, షాలో అఫెక్షన్ కీ, వాళ్ల వర్త్ నే కాదు. వొంటరిగా నుంచోడానికి జడిసి కాదు. వాళ్లని ప్రేమించు. లొంగిపోకు.

3. నువ్వు శృంగార రచనలు చేశావు. స్త్రీ, పురుష సంబంధాలను గురించి విప్లవాత్మకంగా , ఎంతో పచ్చిగా..

[...read more...]


లం వ్యక్తికాదు. ఒక సాహితీ విప్లవం. ఒక సామాజిక ఉద్యమం.నిర్ధిష్టమైన prescribed విలువల్లో కుంచించుకుపోయిన మానవతలోని ఒక పార్శ్వాన్ని తన రచనలతో ఉద్దీపనం చేసిన ఋషి. మనుషులూ,మనసులూ,విలువలూ,నమ్మకాలూ,ఆకర్షణలూ,ఆవేశాలూ అన్నీ మారతాయని చెప్పిన చలం, తన విధానాన్ని మార్చుకుంటే నిరసించాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యక్తులు వ్యక్తిగత,వైవాహిక,సాంఘిక జీవితంలో పెద్ద విఫలురిగా కనిపిస్తారు. అది మన సాధారణ కోణంలోంచీ చూస్తే అలాగే అనిపిస్తుందికూడా. కానీ Their contribution will be measured by a collective consciousness of a society.

చలం సాహిత్యం over rated అనుకునేవాళ్ళకు ప్రపంచసాహిత్యంతో పరిచయం లేదనుకోవాలి. James joeys తన stream of consciousness శైలిలో కుస్తీలు పడుతున్న సమయానికి చలం "మ్యూజింగ్స్" రాసేశాడు. ప్రపంచ సాహిత్యం Absurd,abstract, magic realism అనే మాటలు వంటబట్టించుకున్న సమయంలో చలం "మైదానం" సృష్టించాడు.

చలం ఇంగ్లీషులో రాయలేదుగాబట్టి ఈ ఖర్మగానీ, లేకపోతే ...

[...read more...]



మధ్య నేను రాసిన ‘చలం గురించి నేను’ అనే టపా చదివి మిత్రుడొకరు ‘చలాన్ని అనుభవిస్తాను. చర్చించను. అనే వాడివి, హఠాత్తుగా ఈ మూర్ఖత్వం ఎందుకు చేసావ్?’ అని ప్రశ్నించాడు. నిజానికి నేను నా బ్లాగులో రాసింది ప్రత్యేకమైన టపా కాదు. ఒక బ్లాగులో చలం గురించి జరిగిన చర్చల్లో నేను చేసిన వ్యాఖ్యల్ని, ఒకటిగా కూర్చిపెట్టుకునే ప్రయత్నం మాత్రమే. కానీ ఆ మిత్రుడు, ఆ తరువాత అన్న మాటలు నన్ను మరింత ప్రభావితం చేసాయి. ‘కనీసం ఒంటరిగానైనా, కనీసం చీకటి గదిలోనైనా, తమ నగ్న దేహాన్నీ, మనసునీ ఆసాంతం పరికించి,పరీక్షించి, ప్రశ్నించికోని ఈ జనాలకి చలాన్ని చెప్పాలనుకోవడం మూర్ఖత్వం.చెప్పినా అర్థం చేసుకుంటారనుకోవడం దురాశ. అర్థం చేసుకున్నా, ముసుగుల్లో బ్రతికెయ్యడానికి అలవాటుపడ్డవారు అంగీకరిస్తారనుకోవడం వెర్రితనం.’ ఈ మాటలు విన్న తరువాత నా మూర్ఖత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలనే కోరిక కలిగింది.
నేను అనుభవించిన చలంని, తార్కికంగా అక్షరాల్లోకి కుదించాలనుకోవడం నా సామర్ధ్యాన్ని మించిన పని. ఇలాంటప్పుడే భాషలోని మితి,పరిమితులు తేటతెల్లమవుతాయనుకుంటాను. అనుభవాల్ని అక్షరీకరించడం, ఆలోచనల్ని తెలియజెప్పడమంత తేలిక కాదు. మనసునీ మెదడునీ ఏకకాలంలో ఆక్రమించి, హత్తుకుని, కుదిపివేసి, జీవితానికి కొత్త అర్థాల్ని అందించే అనుభవాల్ని పదాల్లో చెప్పాలంటే...



To be continued...






Print this post

0 comments:

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile