యీ జగత్తుకీ జీవితానికీ ఓ అర్థం వుంటే, వీటి వెనక ఓ సత్యం వుంటే, పరస్పర విరుద్దమైన యీ విలువలకీ ఓ సమన్వయముంటే, దాన్ని తెలుసుకునే మార్గం లేదనీ, మానవుడి మనసుకి అంతశక్తి లేదు గనక,ఎంత తరిచి చూసినా, అది ఓ గుడ్డి వలయంలో తిరగడం తప్ప, ఇంకేమీ సాధింపలేదనీ నిశ్చయించుకున్నాను. కాని ఎప్పుడూ అన్వేషించడం మాత్రం మానుకోలేదు. . . . . .
*
పాత భక్తులూ, ఘరానా వాళ్ళూ భగవాన్ కి దగ్గిరగా కూచునేవారు. నేను చిట్ట చివర కూచుని ఆయన కళ్లలోకే చూస్తో వుండేవాడిని. ఒకసారి భగవాన్ తన దగ్గిర వున్నవాళ్ళని అడిగారు, అందరూ లేచిపోయినా కదలక కూచున్న నన్ను చూపి,
'ఎందుకు అన్ని గంటలూ అట్లా కూచుంటాడు ' అని.
వాళ్ళేదో అన్నారు. అది నా కర్థం కాలేదు. నాకేం కావాలి? ఆధ్యాత్మికోన్నతి. ఆ సంగతి భగవాన్ కి తెలీదా ? . . . .
*
వొయ్యి చచ్చిపోయిన తొందరలోనే అరుణాచలం వెళ్ళలని నిశ్చయించుకున్నాం. . . . భయం పుట్టించే వొంటరితనంలోనూ భగవాన్ మమ్మల్నిఆదుకుని, అర్థంగాని ధైర్యమిచ్చి రక్షించారు. భగవాన్ వెళ్ళేముందు తాను ఇక్కడే వుంటానన్నాడు.నా ఆరోగ్యమూ సన్నగిల్లుతోంది. చివరి దశను సమీపిస్తున్నాను.
Print this post
Wednesday, May 27, 2009
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment