Monday, May 18, 2009

రమణస్థాన్ నుంచి | 10-5-1950 | అరుణాచలం |


10-5-1950 అరుణాచలం












మీ కార్డు. మీ జవాబుకి ముందు ఉత్తరంలో నేనేం రాశానో జ్ఞాపకం లేదు. నా రూపమా?


వారానికోసారి స్నానం. 15 రోజులికి క్షవరం. చిరిగిన బనియను. మరకల చీర ముక్కలుంగీ. షర్టులు అసలు లేవు. ఏమీ చదవను. ఈ కార్డులే రాత. అట్లా ఎండలోకి చూస్తో కూచుంటాను. రాత్రులు చాలాహాయి ఐనగాలి, గాఢమైన నిద్ర , వారానికి రెండు సార్లు కూరలకి, బియ్యానికీ, ఊళ్ళోకి ప్రయాణం. రెండేళ్ళిట్లా వుంటే మాటలూ, అక్షరాలూ, మర్చిపోవచ్చు.



నిన్ననే ఒక తెలుగు admirer ఆ వేపుల్నించి వొచ్చి, న్యూస్ పేపర్లోని రెండు మూడు కబుర్లు చెప్పాడు. ఎన్ని గొడవలూ, ఆలోచనలూ, స్థలం మార్పుతో పోయినాయి. అందుకనే పూర్వం అడవుల్లోకి పోయేవారు గావును, లోకంలో జరిగే మార్పులు చదివేదీ, అవన్నీ మన స్వంత వ్యవహారాలే అనుకుని గొప్పపడేదీ! కాకపోతే వూళ్ళోనో, ఇరుగు పొరుగునో జరిగేవి. వాటిని చర్చించేదీ. నిందించేదీ, తమ ఆధిక్యతను స్థిరపరచుకుని!

ఉన్నాయి కాని చాలా తేలిక పడ్డది బతుకు, ఏ ఆపదలూ రాకుండా, భగవాన్ దయ! పొద్దున్నా, సాయంత్రం, భగవాన్ సమాధి దగ్గర మగవాళ్ళల్లో నేనొక్కణ్ణి regular గా కూచునేవాణ్ణి! నేనుగాక నలుగురు హిందూ ముసలమ్మలూ, యిద్దరు ఇంద్లీషు యువకులూ, నర్తకీ, మా కుక్క సీతాయాబూ! ఏదో పూర్వపు కథల్లో బుద్దుడి సమాధి దగ్గర ధ్యానించే శిస్యులు జ్ఞాపకం వస్తారు.

అవును కొద్దిరోజుల్లో వెళ్ళాలని చూస్తున్నారు. ఆ కొత్త స్వామిగారిని చూడాలని. ముఖ్యం. మా చిత్ర కూతురు డాలీని చూడాలని కూడాను. అందమైన బంగళా దొరికింది, electricity etc.. అన్నీ comforts తో, కాని అద్దె యిచ్చుకుంటూ దాంటో కూడ వుండటంలేదు.





Print this post

0 comments:

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile