Thursday, April 23, 2009

రమణస్థాన్ నుంచి | 8-5-1950 | చలం ఉత్తరాలు


8-5-1950. అరుణాచలం

chalam

దేమిటి, మీ కార్డుకి అప్పుడే జవాబు రాశానే! ఇదన్నా అందుతుందా? భగవాన్ చచ్చిపోయి ఇంకా దగ్గిరైనారు. నిరంతరం ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఆరోగ్యమే తిప్పలు పెడుతూ వుంటుంది.

అవును ఇదంతా ఎడారి ఐపోయింది. ఈ ఆత్మ విద్య ప్రయత్నంలోనే   పశుమలై  వెళ్ళాలనుకుంటున్నాను. ఉత్తరాలు ఇక్కడికే రాయండి. ఏదో కోర్టు బెజవాడనుంచి నూజివీడు వస్తోందట. నా మిత్రులు ప్లీడర్లు నూజివీడికి మారుతున్నారు. మీరూ వున్నారు. ఈ కాలంలో నేను నూజివీడిలో ఉంటే ఎంత బావుండేది అనుకుంటాను. శలవులిచ్చారుగా. మీ పిల్లలూ వాళ్లూ వొచ్చివుంటారు. మీకు మనశ్శాంతిగా వుంటుంది.

 

ఈ ఆత్మాన్వేషణ అంత కష్టమైనదీ, విలువైనదీ, చిత్రమైనదీ, interestingగా వుంటేదీ ఇంకేం లేదనిపిస్తుంది. దొరక్కపోయినా ఈ వేట చాలా సరదాగా, బాధగా వుంది. ఈ ప్రయత్నమంటే అర్థం -  చేతులారా శరీరాన్ని కాక మనసుని హత్య అన్నమాట.

 

ఈ ప్రదేశమంతా యోగులమయం. దొంగయోగులు లేరు. ఏమీలేని బోలుయోగులూ, ఏదో కొంతవరకు సాధించి స్థిమితపడ్డ మహనీయులూ కనపడేవారు చాలా కొంచెం. చాలామంది కనపడరు.






Print this post

0 comments:

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile