Thursday, April 16, 2009

భగవాన్ అస్తమయం || - 2


contd from previous post


(భగవాన్ మృతికి)

ఇంకా మీ ప్రశ్నలు ఉన్నాయి. 'హరీన్ ' పాపం చాలా గోలపడ్డాడు. ఎంత హడలిపోయినాడో! చాలా sentimental man లాగా ఉన్నాడు. ఆ రాత్రి పాడాడుట పీనిగముందు చాలా గొప్పగా. నేను ఇంటికి వచ్చి నిద్రపోయినాను. పెద్ద నక్షత్రం పడ్డది తెలుసా? ఎంత బాధ పడితే నేం 'హరీన్ ' వెళ్ళిపోయినాడు. తన మామూలు జీవితంలోకి, ఆశ్రమం వొదిలి. హరీన్ మద్రాసునించి రేడియోలో భగవాన్ మీద హాయిగా మాట్లాడేడు మొన్నరాత్రి.

కాని నాకింకేం లేదు. భగవాన్ రాకపోతే -- ఇట్లా పడి వుండడమే - ఎదురుచూస్తో - సమాధిని తయారుచేస్తున్నారు. భగవాన్ పోగానే తగాదాలు ఆశ్రమంలో! బ్రాహ్మణ, అబ్రాహ్మణ, అరవ, ఆంధ్ర, పరదేశీయులు ఒక జట్టు ఐనారు. లేచిపోతున్నారు. త్వరలోనే భగవాన్ ని తెచ్చుకుని, మీకు సంతోషంగా ఉత్తరం రాయగలనని నమ్మకం. ప్రస్తుతం అంతే .

P.S.-- రౌడీలు, పోలీసు కాపలాలు - ఒక్క ఆత్మ మౌనమైన రూపుతో ఇన్నేళ్ళు పరిపాలించిన ఆశ్రమం. కృష్ణుడు పోగానే అర్జునుడు ఏడ్చిన ఏడుపు జ్ఙాపకం వొస్తోంది. ద్వారక ఏమయిందో - ఆనాడు - నిజంగానో, కవి హృదయంలోనో, అట్లావుంది లోకం నాకు!





Print this post

1 comments:

krishna rao jallipalli on April 17, 2009 at 7:46 PM said...

మీరు ప్రచురిస్తున్న చలం గారి ఉత్తరాలు నేనింతకుముందు చదవలేదు. బాగున్నాయి. మీ శ్రమకి అబినందనలు.

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile