Wednesday, April 15, 2009

రమణస్థాన్ నుంచి చలం | 16-04-1950 అరుణాచలం


16-04-1950
అరుణాచలం

గవాన్ చచ్చిపోయినారని పేపర్లో చూచి వుంటారు. ఆ దేహానికి అంత్యక్రియలు హడావుడి జరుగుతున్నది ఆశ్రమమంతా! చాలా interesting కలుసుకుంటున్నాను. 'సౌరిస్ ' వాళ్ళూ 15 రోజుల్నించి ఇక్కడ లేరు. ఇక్కడో కొండలపక్క ఊరికి వెళ్ళారు. సౌరిస్ చాలా ఆనందంగా వుంటోంది.

మిత్రులు వొస్తున్నారు ఇక్కడికి, వాళ్ళతో కులాసాగా పొద్దుపోతోంది. హరీన్, భార్యా ఉన్నారు ఇక్కడ కొద్ది రోజుల్నించి, ఇవాళే వెళ్ళారు. భగవాన్ లేరు కళ్ళ ఎదుట. హృదయంలో ఉన్నారో లేదోనని భయపడ్డాను. కాని ఉన్నారు. ఇక్కడే నాతోనే ఉన్నారు. చాలా బావుంటోంది మళ్ళీ. మాటల్లో ఇదంతా భ్రమలాగో, ఆటలాగో అనిపిస్తుంది. కాని నాకు అన్నిటికన్న ఎంత వాస్తవం! ఎంత ఆకర్షణ. ఎంత ముఖ్యం!


చెలం 1950 లో తిరువణ్ణామలై వెళ్ళిపోయారు రు. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా వున్న 'మహాస్థాన్ ' ఆవరణ ఇంట్లో అద్దెకి వున్నారు. ఆ తరవాత అక్కడ ఒక ఇంటిని కొన్నారు. దాని పేరే రమణస్థాన్.




Print this post

0 comments:

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile