Thursday, April 9, 2009

చలం ఉత్తరాలు | ఇంకా గుంటూరే 8-7-1930


ఇంకా గుంటూరే 8-7-1930

Dear నశ్యాఘ్రాతకా !

తమాషాసంగతి. మీ బ్రాహ్మసమాజపు గృహస్తులేడూ రా- , ఆయనా, నా కీకథ చెప్పిన ఆయినా ఒక రైలు పెట్టెలో ప్రయాణం చేస్తున్నారు. ఇద్దరూ నిద్రపోతున్నారు. ఇంతలో పక్క బల్లమీద పడుకున్న ఒకమ్మాయి కేకవేస్తో రా- ని తిడుతో లేచింది.

'ఏంచేశావురా, లం-కొడకా!'
రా- ఇంకా నిద్రపోతోనే వున్నాడు.
'చూడండి, దొంగవెధవ, నిద్రపోతున్నట్టు ఎట్లా పడుకున్నాడో...'
రా- లేచి తానేమి ఎరగనంటాడు.

కాని ఆమె మాత్రం అతను తన రొ-- పట్టుకున్నాడని గోలపెట్టింది.
వెం- తమ మోటారుతో సహా పుట్టినట్టు నటిస్తున్నాడు. ఆమె యాభై యేళ్ళ్వయసుతో పుట్టినట్లు కనపడుతోంది పాపం?


నా భవిష్యత్ కీర్తి మందిరానికి వొచ్చేవారం పునాది వెయ్యబోతున్నాను. అంటే ఒక పాఠశాల స్థాపిస్తున్నాను. ఒక తరగతి, ఒక ఉపాధ్యాయుని, ఒక విద్యార్థిని, ఆ సంస్థకు నేను ప్రిన్సిపాల్ - మాలతీబాయిగారు వైస్ ప్రినిస్పాల్. బోర్డర్లని కూడా తీసుకుంటాము. ఈ యేటికి 5-7 మధ్య వయసుపిల్లల్ని.







Print this post

0 comments:

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile