Thursday, April 16, 2009

భగవాన్ అస్తమయం ||


20-04-1950
అరుణాచలం.

మీ కార్డు, భగవాన్ మరణం సీనులు చాలా అద్భుతం. ఆ సమయానికి world's second best photographer వున్నాడు. ఫోటోలు తీశాడు. అవి సరే. మా మనసుల్లో ఆ ఘోరమైన దృశ్యాలు మరపుకు రావు. ఇప్పుడు ఆశ్రమం పిశాచం మల్లే, వొక కలమల్లే వుంది. ఎక్కడివాళ్ళక్కడ లేచిపోయినారు. చాలా వొంటరితనం. మా వాళ్ళు 15 రోజులకిందటే వెళ్ళిపోయినారు. అదో చిత్రమైన వ్యవహారం 'చే ' బొంబాయిలో, 'షౌ ' మద్రాసులో, 'చిత్ర ' పశుమలైలో తక్కినవాళ్ళెక్కడ వున్నారో తెలీదు. ఎప్పుడు వస్తారో రారో తెలీదు. ఎవరైనా నన్ను గుర్తించి పలకరిస్తే చాలునన్నంత దీనావస్థలో!

ఎంత హాయిగా వుండేదో? భగవాన్ ని తలుచుకుంటే ఆయన పీనిగ మొహం గుర్తుకు వస్తోంది. కదలలేను. ఈ ఎడారిలో... వూరు రెండు మైళ్ళదూరం ఆశ్రమానికి బళ్ళు రావడం మానేశాయి. ఇవాళనే కొంచెం తెరిపి. నా హృదయంలో నే భగవాన్ ఉంటే ఇంకేం ! మీ అందరికీ శాంతి నివ్వగల దక్షత వుండేది కాదా? కాని భగవాన్ నన్ను వొదలరు. వొస్తారు మళ్ళీ. నాకు తెలుసు. నన్ను ఆయన వొదలడమే జరిగితే సూర్యుడి వెలుగు కూడా ఉత్త అబద్దమవుతుంది.ఎంత పరిగెత్తుకుపోవాలనిపించినా, అందుకనే ఇక్కడ వున్నాను. అదిగాక ఎక్కడికి పోను? పిల్లలెవరైనా వొస్తారేమో ? ఇక్కడ మళ్ళీ వుండాలని. సాధించాలి. లేక సాధనలోనే మరణించాలి.

రెండేళ్ల కిందట బెజవాడ, నూజివీడు, ఈవాళ!... తమాషా !
[To be contd...]



చెలం 1950 లో తిరువణ్ణామలై వెళ్ళిపోయారు రు. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా వున్న 'మహాస్థాన్ ' ఆవరణ ఇంట్లో అద్దెకి వున్నారు. ఆ తరవాత అక్కడ ఒక ఇంటిని కొన్నారు. దాని పేరే రమణస్థాన్. యీ పై ఉత్తరం భగవాన్ చనిపోయిన తరువాత కొన్నిరోజులకు తన మిత్రుడు చిన్నారావుకు రాసింది.





Print this post

0 comments:

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile