
ఇది చలాన్ని ద్వేషించేవాళ్ళు,
అభిమానించేవాళ్ళు,
చలం గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళ గురించి.
చలం భావోద్వేగాలు, నిష్పక్షపాత విమర్శనాస్త్రాలు, ఆయా మిత్రుల గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు, సమకాలీన దేశ స్థితి గతులపై వెళ్ళగక్కిన ఆవేశానురాగాలు, ఆయన్ను పట్టి వుంచే బంధాల గురించి, తనని చీల్చి చెండాడి, వూపేసిన స్త్రీలోకానికి సంబంధించి, కుత్సితాల గురించి, కుట్రల గురించి , నీచత్వం గురించి, ప్రేమల గురించి, పువ్వుల గురించి, విశ్వం గురించి, ఈశ్వరుడి గురించి, పాటల గురించి, మాటల గురించి యెన్నో, యెన్నెన్నో చినుకుగా రాలి, నదులుగా సాగి, వరదలై పొంగిన ఆయన భావసముద్రాలు-తన ప్రియ మిత్రునికి(శ్రీ చింతా దీక్షితులు గారు) రాసిన ఉత్తరాల్లో, తొలిపొద్దున పూరెక్కలపై మెరిసే మంచు బిందువులంతటి స్వఛ్చంగా మనకు కనిపిస్తాయి. చలం తను ఎక్కువగా ప్రేమించే వ్యక్తుల్లో శ్రీ చింతా దీక్షితులు గారు ముఖ్యులు. కాని యిద్దరూ తూర్పుపడమర లాంటివారు.అయితేనేం వాళ్ళ స్నేహం దివ్యంగా సాగింది.ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించేవాళ్ళు. ఒకరి నుంచి మరొకరు యేనాడు ఆశించింది లేదు. అదే వారి స్నేహాన్ని మరింత బలోపేతం చేసింది. యీ యిద్దరూ మిత్రులు తరచుగా సుమారు 1928 ప్రాంతం నుంచి ఉత్తర ప్రత్త్యుత్తరాలు జరుపుకునేవారు. చింతా దీక్షితులు గారు వాటిని జాగ్రత్త చేయటం వల్ల అవి తర్వాత అచ్చులో కనబడగలిగాయి. ప్రస్తుతం ఆ పుస్తకాన్ని నిషేధించారో లేక ముద్రించటం మానేశారో కాని లభ్యం కావటం లేదు.
వొక లైబ్రరీలో వో మూల దుమ్ముకొట్టి గాలికి రెపరెపలాడ్తో వుంటే తీసుకుని చూస్తే అది చలంగారి ఈ ఉత్తరాలు.
అందులోంచే కొన్ని కొన్ని బిందువులు.
Print this post
2 comments:
మంచిపని చేస్తున్నారు.
మీ బ్లాగు జల్లెడకు కలపడం జరిగినది.
జల్లెడ
www.jalleda.com
its really nice reading chalam...and your blog..its nice.. why you are not continuing it? please do that...
thanks
Post a Comment