Saturday, September 29, 2007

కలలు


బెజవాడ, 5-3-32,


...నేను అన్ని ఆశయాలూ వొదులుకున్నాను, ఈ వొక్కటి తప్ప-నేను గొప్ప యోగినౌతాను.నా అద్భుతమహిమల కీర్తి దిగంతంగా వ్యాపిస్తుంది. స్త్రీ పురుషులు నా పాదాలముందు నమస్కరిస్తారు. నా మహిమలలో ముఖ్యంగా నేను చేసేది, యవ్వనంలో వున్న భార్యలకి పిల్లలు లేకపోతే, సంతానమివ్వడం, ___(సెన్సార్డ్)వితంతువులకి కూడా- .

ఈ లోపల నన్ను పనిలోంచి తొలగించకపోతే, 75 రూ. పని విరమించుకుంటాము. జీవితంలో అన్నీ ఆలస్యంగా వొస్తాయి. ఏమంటారు ? ఎన్నో చెయ్యాలని కలలు కన్నాను. ఇంకా కలలు కంటున్నాను-నాకే ఆరోగ్యమూ, ఐశ్వర్యమూ ఉంటేనా? ఈ రెండు కూడా సంపాయిస్తానేమో ఎప్పటికన్నా? కాని అప్పటికి నా కలల్ని చూసి పిల్ల చేష్టలని నేనే నవ్వవచ్చు.. ఏమంటారు?

ఈనాడు నాకు ఓ సంగతి తెలుసు. మీ దేవుళ్లు అబద్దం. నా దేవుడే సర్వశక్తివంతుడైన దేవుడు. అతను శూన్యం. ఏమంటారు?

జవాబు వెంటనే ఇచ్చేటంత రెచ్చకొట్టానా మిమ్మన్ని!






Print this post

0 comments:

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile