... ప్రస్తుతం నా ఆశయం తూర్పు ఇండియా దీవులకి వెళ్లాలని. పోనీ పారిస్ కి లేక న్యూయార్కుకి వెళ్ళాలని, హాలీవుడ్లో సినిమాతారలు సన్నబడడానికి యోగ వ్యాయామం నేర్పి, సాధ్యమైనదంతా అనుభవిద్దామని -అంటే డబ్బుతో తెచ్చుకోలేని ప్రేమా...ఇంకా.
నాకు శాంతి వొద్దు, ఆనందం నాకఖ్కర్లేదు. నాక్కావలసింది జ్వలించే మహోద్రేకమూ . తరువాత సంభవించే విషాదమూ. నేను శివుణ్ణి: శక్తిని స్వాధీనం చేసుకుంటాను. అనేక సుందరమైన శరీరాలలో ఆమెని అనుభవిస్తాను. అదీ నా ముక్తి మార్గం.
ఈ ఎండాకాలం ఎక్కడికి వెడతారు? నేను లోనవ్లా కాని నదికొండలకి గాని వెడతాను. తప్పిందా ఇక్కడ చక్కగా కాలతాను. తీవ్రమైన ఎండ ఇష్టం నాకు.
Print this post
0 comments:
Post a Comment