Thursday, September 27, 2007

ఇష్టం


బెజవాడ, 5-2-32,

...నా యోగ దృష్టిని తన చూపుతో లాగాలని ప్రయత్నిస్తో ఇప్పుడే ఓ అమ్మాయి వెడుతోంది కిటికీకింద. ఆ అమ్మాయి ఇష్టపడుతోంది, నేనూ ఇష్టపడుతున్నాను, యీ రెండు నెలలూ ఇష్టపడుతోనే వున్నాను. కాని మా మధ్య యీ పది గజాల దాటరాని దూరమూ అభ్యంతరం . గాలిలో ప్రయాణం చేసే శక్తి యీ యోగం యివ్వనన్నా ఇవ్వాలి. ఆ మాత్రం దూరం నా శరీరంలో ___ (సెన్సార్డ్) శక్తినన్నా యివ్వాలి. అంతదాకా లాభం లేదు.

రైలుకిందబడ్డ ఒక మేకని రక్షించి తీసికొచ్చాను . దాని కాలునొకదాన్ని పట్టాల మీదనే వొదిలి . కోటు జేబుల్లోనించీ, పరుపు దుప్పట్లకిందనించీ, గొంగళిపురుగుల్ని పోగు చేసి, అద్దాల పెట్టెల్లో పెట్టి సీతాకోకచిలుకల్ని తయారు చేస్తున్నాము. పాడు వాసన కొడుతున్నాయి. నీళ్లకుండలో చాపలు. తాబేలు పారిపోయింది. బాతుల్ని తెప్పిస్తున్నాను. ఏం తోచటం లేదు. రైలుస్టేషన్ లో జీవిస్తున్నాను. హిగింబాదంస్ పుస్తకాల షాపూ-mag sulph, ప్రతి సాయంత్రం.






Print this post

0 comments:

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile