Sunday, September 16, 2007

రచయితలు


తెనాలి, 25-1-29.

...రచయితలు రెండు రకాలు. ఒక ఉద్గ్రంధాన్ని (మాస్టర్ పీస్) వొదిలిపోయేవారు.
తాము స్వంతంగా గొప్పగా యేదీ రాయకపోయినా,
సారస్వతానికి కొత్త జీవనాన్నిచ్చేవారు. యే కొందరో యీ రెండూ చెయ్యగలవారుంటారు.
మీ వరూధినీ, చెంచురాణీ తెలుసు.అవి చాలా బావున్నాయి.
మీకు శైలి వుంది. ప్రేమా-హాస్యమూ వున్నాయి మీలో.
మీ రచనల్ని ప్రేమించే చాలా ఉత్తమ పురుషుల్ని
ఎరుగుదును నేను. కాని నా స్వభావం మీనించి చాలా భిన్నం.
కనక మీకు న్యాయమైన విలువ కట్టలేను.
2.మునిమాణిక్యానిది ఆ నిమిషానికి కులాసాగా చదవడానికి పనికి వస్తాయి. .
All sentiment and tawdriness
ప్రస్తుత కాలపు కుటుంబ జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. కాని disgustingly small.
3.M.N.Sastry ని ఒక రచకుడిగా ఎంచను.
4.విశ్వనాధ- ఆయన కవిత్వం నాకు అర్ధం కాదు.
తప్పిదం చాలా వరకు నాదేననుకుంటాను.
ఆయన నాటకాలలో యేవీ గొప్పవి కావు. Quite disappointing.
5.క్రిష్ణశాస్త్రి- ఆయన వూర్వశి is disappointing . ఇంకా వెన్నెముక గట్టిపడి,
సూనృతమూ, ఉత్సాహమూ అతని జీవితంలోకి-దత్వారా, కవిత్వంలోకీ వొస్తే
-తను ఏమి అనుభవించానని ప్రజలు అనుకోవాలనుకుంటున్నాడు అది కాక-
తను నిజంగా ఏమి ఎట్లా అనుభవించాడో అది వ్రాస్తే-
అతను అద్భుతమైన గీతాలు వ్రాయగలడు.
నా ఉద్దేశంలో ప్రస్తుతపు రచకుల్లో అతను అగ్రగణ్యుడని.
కాని అతని రచనలు అస్పష్టము, అనవసరంగా అయోమయం.
కాని స్వంతంగా, నాకు గొప్పగా వుంటాయి. అతని రచనలు.
అతని-fine delicate toches at the heart.
హృదయం మీద అతనిచ్చే నాజూకు నొక్కులు .
6.వేదుల కలంలో శక్తి వుంది. తన కవిత్వం కోసమన్నా
బతుకుతున్నాడు. కాని చాలా సంకుచితం. ఇరుకు. బాగా కేంద్రీకరించగలడు.
కాని విశాలమైనది ఏమన్నా ప్రయత్నించి తప్పిపోతాడు.
7.సభాపతి-అతని హౄదయేశ్వరి నాకు ఇష్టం.
ముందు కాలంలో జ్ఙాపకముంటేనేం లేకపోతేనేం-అతను మనకి జాన్సన్ . ఒక Force
8.నాయని -అతని కవిత్వం నాకు నచ్చదు
9.బసవరాజు అప్పారావు-ఒక గొప్ప కవిత్వపు పంక్తి కోసం నూరు డబ్బాల చెత్త రాస్తాడు.
ఇప్పటికే అతన్ని మర్చిపోవడం న్యాయంగా తోస్తుంది.
10.రాయప్రోలు-కొత్త యుగాన్ని ప్రారంభించాడు. మంచి శైలి .
Thought (కొత్త అభిప్రాయాలు) సున్న.
సారస్వతం రెండు రకాలు.
1. అందమైన పటం మల్లే గోడని వేళ్లాడుతో-మనసుని అందాలతో నింపేది.
2. ఉరిమి, చించి చెండాడి, మంచికో చెడ్డకో, జీవితాన్ని చేసేది.




Print this post

0 comments:

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile