Monday, October 1, 2007

ఎంకిపాటలు


బెజవాడ, 16-11-33,



విశ్వనాధా నేనూ ఎందుకు పంచుకోవాలి యూనివర్సిటీ బహుమానాన్ని! మీ ప్రేమని పంచుకుంటున్నామనే కారణం వల్లనా? నా పోటీనించి ఆయన కేమీ భయం అఖ్ఖర్లేదు. మీకు తెలీదనా?-తన మెదడు సరిగా తలలో వున్న మనిషి ఎవడూ నాకు బహుమానం ఇవ్వాలనుకోడు. ...కనక, Old Boy, గమనించండి, మీరు వూరికే గోలపడి చెమటలూడ్చి, ఎవరికీ లాభం లేదు. చక్కగా నవల పట్టుకుని, కాళ్లు బల్లపై పెట్టి, నోట్లో పెద్ద చుట్టపెట్టి, మీ గదిలో కూచోండి. ఎవరన్నా కదిపారా, ‘Damn You Get Out’ అనండి. మీకు ధైర్యముంటే ఓ అమ్మాయిని తెచ్చుకోండి, కబుర్లు మొదలైనవాటికి.

...ఆంధ్ర పత్రిక వాళ్లు వాళ్ల జూబిలీ ఉత్సవ సంధర్భంలో నా అభిప్రాయం అడిగారు. 'ఆంధ్రపత్రిక అనే పేరు వినలేద 'ని వ్రాశాను. క్రిస్మస్ లో రాజమండ్రి వొస్తాను-- ప్రేమ ఆటంక పెడితే తప్ప .శలవ తీసుకొని రండి. ఎవరూ కొత్త స్త్రీలు లేరు నాతో ప్రస్తుతం . కాని expect చేస్తున్నాను. వొచ్చినా మిమ్మల్ని ఇబ్బందిపెట్టనీను.


18 తారీఖు రాత్రి, నా విద్యార్థులూ, ఉపాధ్యాయులూ, నా పిల్లలూ, నాటకాలు ఆడుతున్నారు. నేను ఎంకిపాటలు పాడాలిట. మీకు తెలుసుగా, పోయినసారి నేను బోగం అమ్మాయితో కలిసి ఎంకిపాటలు పాడానని. ఆమె నా సావిత్రిగా నా సావిత్రి నాటకం వేశానని! ప్రేక్షకులు బాగానే మింగి హర్షించి స్తుతించారు, ఆమెనూ, నన్నూ. ఈసారి నేనొక్కణ్ణే పాడాల్సి వొచ్చింది.

(ఆనాటి) యెంకి దూరానుండె
యేటి (కృష్ణ) దరి నేనుంటి
సావాసమింకెవరు? సాలెదే అనుకొంటి.

సుబ్బారావు పాటల్ని అన్నిటినీ పేరడీ చేస్తున్నాను. ప్రతీ సంవత్సరం నానించి విధ్యార్థులు నేర్చుకునే ముఖ్య విషయం దేవుడు లేడని.






Print this post

0 comments:

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile