బెజవాడ, 24-04-34,
మనిషి కోరుకోదగినవన్నీ న్యాయంగా జీవితంలో కావాలని అనుకోతగినవన్నీ ఉన్నాయి నాకు. కాని నేను విషాదంగా (Miserable) గా వున్నాను. చాలాసార్లు ఆలోచిస్తాను. నేను తక్కిన మనుషులమల్లే, తృప్తిగా ఉన్నవాటితో సంతోషపడుతో వుండకూడదా? ఎందుకు ఉండలేను ? ఉండను అని. ఈ సమస్య విప్పండి. చాతనైతే. మీమీద దేవతలకి దయలేదు. నా మీదా లేదు. కాని మీమీద చాలామంది మనుషులకి ప్రేమ వుంది. నా మీద స్త్రీలకి - వాళ్లలో కొందరికైనా-తాత్కాలికంగానైనా( తాత్కాలికమైనదాన్ని ప్రేమ అనగలిగితే.)
... నా పాప చాలా అల్లరిది. నేనింతవరకు ప్రేమించిన మొదటిపాప. తమాషా, నేను ప్రేమించడం నేర్చుకున్న మొదటిపాప, మాకు పుట్టినపాప కాదు.
...ధనుష్కోటిలో చాలా మంచి చాపలు దొరుకుతాయట. తినడానికి వెడుతున్నాను. మీరూ రండి. తరవాత Girls కోసం ట్రావెంకూరు- తరువాత కన్యాకుమరి.
Print this post
Thursday, October 4, 2007
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
చలం గారి ఉత్తరాలన్ని బ్లాగులలో పెడుతున్నరా?
చాలా మంచి పని
ఈ విధంగానే కొనసాగించండి
మీ బ్లాగు మంచి పేరు సంపాదించుకుంటుంది
Post a Comment