Wednesday, October 10, 2007

మృత్యువు


బెజవాడ, 28-6-35,

నేను వ్రాసిన 'మృత్యువు 'ని గురించి - Thanks for your assurance. ఏమిటంటే, నేను ప్రేమ కథ వ్రాసినపుడు దాని విలువని నేను తెలుసుకోగలను. కాని ఆధ్యాత్మిక విషయాలు, అర్థం లేని చత్త వ్రాశానేమోనని భయమేస్తుంది. అందుకని ఇతర్ల అభిప్రాయాన్ని అడుగుతాను.

ఏ మనిషి యిచ్చే పరిష్కారాలైనా ఈ ప్రపంచ సమస్యల్ని తీర్చగల సత్యాలైతే, ( ముఖ్యంగా నా solutions) ఈ ప్రపంచం చాలా స్వల్పమైన ప్రపంచమూ, దివాలా ఐన దేవుడూ ఐ వుండాలి. కాని నేను నిశ్చయంగా తెలుసుకోవాలనుకున్నదేమిటంటే, అది (మృత్యువు) ఆలోచించేట్టు చేస్తుందా-మనుష్యులకీ, పనులకీ వాళ్లు కలగనలేని కొత్త విలువలు వున్నాయని తెలుసుకునేట్టు చేస్తుందా అని.

కొత్త అన్వేషణానికి మీ వుత్తరం నాకు కొత్త ధైర్యాన్ని ఇస్తోంది.




Print this post

0 comments:

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile