Saturday, October 6, 2007

స్త్రీ


బెజవాడ, 26-11-35,

త్తరాలలో మర్యాదలూ, మన్ననలూ మానేస్తున్నాను. కనక తప్పు అర్థం చేసుకోకండి.నేనెట్లా వున్నానో అనే మీ ఆదుర్దా నన్ను చాలా ప్రేమతో కావలించుకుంది. అంత దయ మీనుంచి తప్ప నాకెక్కడినుంచి వొస్తుంది.
(ఆమె కోసం నా బాధని) నేను తాగి మరచిపోగలిగితే బావుండును. కాని ఆ అదృష్టం లేదు.నాకు దానికి కావలసిన డబ్బు శక్తి ఏవీ లేవు. మర్నాడు తలనొప్పితో ప్రాయశ్చిత్తమవుతుంది. స్త్రీ తప్ప నన్ను గట్టిగా కదిలించగలది ఏదీ లేదు. స్త్రీ కోసం జీవితాల్ని ధ్వంసం చేసుకున్న వాళ్లని, అంటే కీర్తీ, డబ్బూ కాదు- అంతకన్న శ్రేష్టమైనవి -జీవితం మీద ఆసక్తినీ-శక్తినీ-బతకడంలో ఆనందాన్నీ, (Grip on Life and Joy of Living) పోగొట్టుకున్న వాళ్లని చూస్తే నేను చాలా వెవేకవంతుణ్ణిగా తోస్తాను.




Print this post

0 comments:

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile