ఏం చెయ్యను, నేను మిమ్మల్ని రాజమండ్రినించి బెజవాడ రప్పించేందుకు-లేని, చెవిటి, గుడ్డి, దేవుణ్ణి ప్రార్థించనా? ఈ నెల్లూరులో నాకు ఆ Paul Brunton ఎక్కడ దొరుకుతుంది? చాపలు తప్ప ఇక్కడ ఏమీ దొరకవు. నెల్లూరు నెరజాణలు వుత్త కథలు(Myth).The fast ones are ugly,loose ones nasty.
పిచ్చి అయ్యరు నన్ను ఆడపిల్లలబడికి ఎందుకు మారుస్తాడు? వివాహాన్ని గురించి నా అభిప్రాయాలు ఇట్లాంటివని complain చేస్తున్నాట్ట. నేను బోగం అమ్మాయితో బళ్లో సరసాలాడుతున్నానని సు__ పైకి వ్రాశాడు.అవును నాకు ఎప్పుడూ తెలుసు.నాకన్న మీకే ఆడవాళ్ల సంగతి బాగా తెలుసునని.
సౌందర్యాన్ని ఆరాధిస్తున్నాను.ఇన్నాళ్లూ పై సగం భాగాన్ని.ఇపుడు ___ side realise చేస్తున్నాను .వ్రాతల్లో చూపుతున్నాను. నిన్న రాత్రి వెన్నెల ఎంత బాధించింది! న__ డి బాధ తెలిసి వస్తోంది! కోర్కె, కాని వీలు లేదు. ఎప్పుడు పెళ్లి? ఎక్కడ? ఎపుడు? 'మేట్' లేకండా గంతులేసే చలం. ఒకటే సృష్టిస్తున్నాను, సారసత్వంలో నా వీ__ శక్తిని కధల్లోకి transmute చేస్తున్నాననుకుంటాను.
Print this post
11 comments:
UPHiQh Hello! Great blog you have! My greetings!
HM1TVK Your blog is great. Articles is interesting!
XP77pU Wonderful blog.
9fFUhm Please write anything else!
Tij0Eq Hello all!
Magnific!
Good job!
Hello all!
Hello all!
7XQXio Magnific!
Hello all!
Post a Comment